Bobby Deol | సినిమా ఇండస్ట్రీలో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావడానికి ఎంతో సమయం పట్టదు. ఒకప్పుడు ఉన్నంతగా ఉన్నవారు కూడా కొద్ది సార్లు అనుకోని విధంగా చతికిల పడుతుంటారు. అయితే యానిమల్ విలన్ బాబి డియోల్ జీవితంలో కూడా విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. యానిమల్ సినిమాకి ముందు బాబి డియోల్ ఏకంగా 15 ఏళ్ల పాటు ఖాళీగా ఉన్నాడట. కేవలం భార్య సంపాదనతో బ్రతికాడంట. తనకి ఎలాంటి అవకాశాలు రాలేదట. గుప్త్, ఔర్ ప్యార్ హోగయా, కరీబ్, సోల్జర్, దిల్లగి, బిచ్చూ వంటి తదితర సినిమాలతో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నబాబి డియోల్‌కి అవకాశాలే కరువయ్యాయట.
ఆ సమయంలో బాబీ కెరీర్ ని మళ్లీ టాప్‌లో నిలబెట్టాడు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ చిత్రంలో బాబి డియోల్‌ని విలన్‌గా ఎంపిక చేసి అతనికి లైఫ్ ఇచ్చాడు. చిత్రంలో బాబి డియోల్ కనిపించేది తక్కువ సమయమే అయిన అబ్రార్ హక్ క్యారెక్టర్లో తనదైన నటనతో సంచలనం సృష్టించాడు. ఈ సినిమాతో మళ్లీ బిజీ అయినా బాలీడియోల్ ఇప్పుడు సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్ బాబి రూపొందించిన ‘డాకు మహారాజ్’లో బాబీ డియోల్ నటించి అలరించారు. అయితే ఈ సినిమా టైంలో దర్శకుడు బాబి .. ఈ బాలీవుడ్ నటుడి గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
యానిమల్’ సినిమాకు ముందు బాబీ డియోల్ బాలీవుడ్ డైరెక్టర్లకు ఫోటోలు పంపించి అవకాశాలు అడిగితే లుక్ బాగుంది. చెబుతాం అని ముఖం చాటేసేవారట. ఆ సమయంలోనే మీ తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వచ్చి నా జీవితాన్ని మార్చేశాడు అని బాబికి చెప్పాడట. సందీప్ పేరు తీస్తే బాబి డియోల్ ఎమోషనల్ అయిపోతారట. ఒక దశలో తండ్రి గురించి పెద్దగా తెలిసియని పిల్లలు ‘అమ్మా నాన్న అసలు పనే చేయడా? ‘ అని అడగడంతో ఆ మాటలు విన్న బాబీడియోల్ చనిపోవాలనుకున్నాడట. అంత దారుణమైన స్థితి నుండి ఇప్పుడు తను కొంత మెరుగు పడినట్టు బాబి చెప్పాడు. అయితే తనకు కిక్లేకపోతే అంగీకరించడం లేదని దర్శకుడు బాబి తెలిపారు.