Reporter | గుండాల , ఫిబ్రవరి 9 : గత పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ మృతి చెందిన సంఘటన గుండాల మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రాచకొండ సంతోష్ కుమార్ (33) గత పది సంవత్సరాలకాలంగా వివిధ పత్రికల్లో పనిచేస్తున్నాడు.
ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతున్న సంతోష్‌కుమార్‌ను కుటుంబ సభ్యులు ఖమ్మం ,వరంగల్ పట్టణం ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఖమ్మం ప్రవేట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతుడు మండలంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడు కావడంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్