ఆలేరు టౌన్, ఆగస్టు 30 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి పై రాహుల్ గాంధీ బీహార్లో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని బిజెపి ఆలేరు మండల, పట్టణ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేశ్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం ఆయన దిష్టిబొమ్మను ఆలేరు రైల్వే గేట్ వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న బీహార్ ఎన్నికల్లో బిజెపి గెలుస్తదని ఆక్రోషంతో రాహుల్ ఇలా అనుచిత వ్యాఖ్యలకు పూనుకున్నట్లు దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కామిటికార్ కృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డేమాన్ నరేందర్, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు ఎలగల వెంకటేశ్, సుంకరి సృజన్ కుమార్ గౌడ్, శేషత్వ అమరేందర్, సీనియర్ నాయకులు పసుపునురి వీరేశం, ఎలగందుల సురేశ్, సముద్రాల శ్రీనివాస్, బందెల సుభాష్, పూల హనుమంతు, సుక్కరాజు, బైరి మహేంద్ర గౌడ్, వడ్డేపల్లి కిషన్, గాజుల సారయ్య, గుర్రం నరసింహులు, దూడల అజయ్, మధు, రవి పాల్గొన్నారు.