రామన్నపేట, డిసెంబర్ 01 : బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం రామన్నపేట మండలంలోని సర్నేనిగూడెం గ్రామానికి చెందిన నీల వెంకటేశ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. వీరందరికి చిరుమర్తి లింగయ్య గులాబీ కండుకవాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా నీల వెంకటేశ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలన్నారు.
ఓటు అభ్యర్థించేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీల అమలుపై నిలదీయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ధరణి భాస్కర్, ఉపాధ్యక్షుడు రూపాని వెంకటేశ్, కార్యదర్శి గంగాదేవి జంగయ్య, మాజీ సర్పంచ్ రూపాని గంగయ్య, కాసర్ల సత్యవర్ధన్‌రెడ్డి, నస్నూరి నర్సిరెడ్డి, కంచర్ల మల్లయ్య, రూపాని శంకరయ్య, నీల దమోదర్, వర్ర శ్రీను, మధుసుధన్ రెడ్డి, వరికుప్పల నర్సింహ్మ, కళ్యాణ్ రెడ్డి, రూపాని రాజు, రమేశ్ పాల్గొన్నారు.

Ramannapet : బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య