బీబీనగర్ : దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు దళిత సమాజం మొత్తం అండగా నిలువాలని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో దళితబంధు పథకాన్ని అమలు చేసి లబ్ధిదారుల అకౌంట్లలో రూ.10 లక్షలు జమ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఫ్లెక్షీకి క్షీరాభిషేకం నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతుంద నడానికి రైతుబంధు పథకం నిదర్శనమన్నారు. దళితబంధు ఏర్పాటు చేయడం ద్వారా దళిత వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని, విద్యా, వ్యాపారం, ఉద్యోగ పరంగా ముందుకు సాగుతాయని, ఈ పథకం ద్వారా ఎంతో మంది దళితుల బతుకులు బాగు పడు తాయన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్ జడ్పీటీసీ గోలి ప్రణీతా పింగళ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, సర్పంచ్ మంచాల రవి కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు మంచాల నరహరి, టీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్, ఎంపీటీసీ గోరుకంటి బాల్‌చందర్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు బింగి శ్రీనివాస్, సర్పంచ్‌లు బక్కన్న బాలమణి , దేవరకొండ వేణు, మన్నె రాజేందర్ పాల్గొన్నారు.