భువనగిరి అర్బన్: మండలంలోని తుక్కాపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనం నిర్మాణ పనులను డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను ప్రణాళిక ప్రకారం అంచనా వేసుకుని
నిర్థేశించిన సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఏపీడీ శ్యామల, ఏపీవో బాల స్వామి, ఈసీ ముబషిర్, టీఏఎస్ రామచంద్రయ్య, నాగరాజు, రాజమణి, మానస, పీఎస్ రాజు, వార్డు సభ్యులు ఉన్నారు.