భువనగిరి కలెక్టరేట్ : ప్రజావాణిలో స్వీకరించే ఆర్జీలకు త్వరితగతిన పరిష్కార మార్గాలను చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఆర్జీదారుల నుంచి పలు సమస్యలపై వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల సత్వర సరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజావాణి ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ఎప్పటి కప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా 45 ఆర్జీలను స్వీకరించారు.