‘అపర భగీరథుడు కేసీఆర్’
రాజాపేట మండలంలోని రఘునాథపురం వాగులోని చెక్ డ్యాం వద్ద గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్..
– రఘునాథపురం సర్పంచ్ పల్లె సంతోశ్ గౌడ్
రాజాపేట, మార్చి 21 : రాజాపేట మండలంలోని రఘునాథపురం వాగులోని చెక్ డ్యాం వద్ద గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కరువు నేలను తడిపి సస్యశ్యామలం చేయాలని అపర భగీరదుడిలా బాహుబలి లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నేడు మండు ఎండాకాలంలో సైతం కాళేశ్వరం జలాలు వాగులు వంకల్లో పరవళ్లు తొక్కుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం పాలాభిషేకం నిర్వహించినట్లు వారు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఒక విజన్తో ముందుకు సాగడంతో నేడు కరువు నేలకు కాళేశ్వరం జలాలు ముద్దాడుతున్నాయన్నారు.
మండుటెండలో సైతం చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు దుంకడం కేసీఆర్ చేసిన కృషికి నిదర్శనం అని కొనియాడారు. పొట్టిమర్రి వాగులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సహకారంతో మూడు చెక్ డ్యాంలు నిర్మించడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండం రాజు, వార్డు మెంబర్లు ఎర్ర మల్లేశ్, తుంగ అక్షయ్ కుమార్, తుంగ సతీశ్, నాయకులు కలకుంట్ల పోచయ్య, కటకం చిన్న వెంకటేశం, కుందనపల్లి నరసింహులు, బత్తిని పరశురాములు, సిద్ధిరాములు, తుంగ నగేశ్, బొద్దుల శ్రీకాంత్, పిట్టల వెంకటేశం, బత్తెం నాగరాజు, కటకం పృథ్విరాజ్, ఎడ్ల సాగర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

