ఆత్మకూరు (ఎం), అక్టోబర్ 13 : ఆత్మకూరు (ఎం) మండలంలోని లింగరాజుపల్లి, కూరెళ్లె గ్రామాల్లో సోమవారం తెల్లవారుజామున 3 గంటల పాటు అతి భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామాలలోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. రైతులు పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యంతో పాటు కుప్పలుగా పోసిన ధాన్యం భారీ వర్షానికి తడిసి ముద్దయింది. ముద్దవడంతో పాటు ధాన్యం కొట్టుకుపోయింది. కూరెళ్ల గ్రామంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు (ఎం), మొరిపిరాల, కొరటికల్, పల్లెర్ల, రహీంఖాన్ పేట, రాయిపల్లి గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. లింగరాజుపల్లి గ్రామంలో 9 మంది రైతులకు సంబంధించిన వరి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోవడంతో భారీ నష్టం వాటిల్లడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Atmakur (M) : ఆత్మకూర్(ఎం)లో భారీ వర్షానికి కొట్టుకుపోయిన వరి ధాన్యం