భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 19: జంట నగరాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో భూదాన్ పోచంపల్లి (Pochampally) మండలం జూలూరు-రుద్రవెల్లిలో లెవెల్ బ్రిడ్జి వద్ద మూసీ పరవళ్ళు తొక్కుతున్నది. భారీగా వరద పోటెత్తడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవావం ఎక్కువగా ఉండటంతో సోమవారం రాత్రి నుంచి వంతెనకు ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో బీబీనగర్, ఘట్కేసర్, భువనగిరికి వెళ్లేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద రావులపల్లి మీదుగా 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళుతున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, వర్షాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Pochampally 1