భువనగిరి అర్బన్, జూన్ 10 : భువనగిరి నియోజవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో మండల అధ్యక్షులను నియమించడంలో కాంగ్రెస్ పా6ర్టీ దళితులకు ఒక అధ్యక్ష పదవి కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దళితులను అవమానపరిచాడని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బారామకృష్ణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ ప్రెస్ మీట్ లో బుధవారం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నూతనంగా మండల అధ్యక్షులు, మున్సిపాలిటీ అధ్యక్షులను నియమిస్తున్న క్రమంలో భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాలుగు మండలాలలో, రెండు మున్సిపాలిటీలో ఒక ఎస్సీ, ఎస్టీకి అధ్యక్షుల పదవి ఇవ్వకుండా అవమాన పరిచి తీరని అన్యాయం చేశారన్నారు. ఈ నియామకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానమని, కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి దళితులకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని, కాంగ్రెస్ పార్టీ దళితులకు పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలలోని దళితులకు మోసం చేశాడని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షులను నియమిస్తున్న క్రమంలో ఒక అధ్యక్ష పదవి ఎస్సీ, ఎస్టీలకు, రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు అధ్యక్ష పదవిలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, దళితులకు అన్ని రకాల ఆదుకుంటున్నామని ఒకపక్క చెపుతూ, మున్సిపాలిటీ ఎలక్షన్లో జరిగిన కౌన్సిలర్లు ఎన్నికలలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎస్సీలకు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భువనగిరి పట్టణంలో చైర్మన్, వైస్ చైర్మన్ బీసీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎస్సీలకు ఇవ్వడం జరిగిందన్నారు. మండల అధ్యక్షులను రెండుసార్లు బీసీలను నియమించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు పదవులు లేకుండా చేసిందని ఎమ్మార్పీఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికైనా ఇప్పుడు పెట్టిన అధ్యక్షులను పునర్ సమీక్షించి ఒక మండల అధ్యక్షుడిగా ఒక మున్సిపల్ అధ్యక్షుడిగా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, లేనియెడల భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మార్పీఎస్ హెచ్చరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహకార దర్శి ఇటుకల దేవేందర్, జిల్లా కార్యదర్శి బండారు శివ శంకర్, భువనగిరి మండల అధ్యక్షుడు కోట ఉపేంద్ర, ఉపాధ్యక్షుడు డాక్టర్ మంచాల మహేష్, బొమ్మలరామారం మండల అధ్యక్షుడు మైలారం జంగయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు అంద సాయి, సుధాకర్, చిర్ర శ్రీనివాస్, మల్లయ్య, మైసయ్య పాల్గొన్నారు.