రాజాపేట, ఏప్రిల్ 21 : మత సామరస్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ప్రధానోపాధ్యాయులు మనోజ్ కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని రఘునాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు మన దేశ భిన్నత్వంలో ఏకత్వం చిత్రాలను గీసి ప్రదర్శించారు.
అనంతరం విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం విభిన్న సంస్కృతులు, సంప్రదాయలకు నిలయమన్నారు. వందల ఏండ్ల నుంచి ఇక్కడ అనేక రకాల ప్రజలు అన్యోన్యంగా కలిసి ఉంటున్నారని తెలిపారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే మతసామరస్యంపై అవగాహన కల్పించాలన్నారు.