చౌటుప్పల్, ఫిబ్రవరి 04 : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొయ్యడ శేఖర్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. బుధవారం ఆయన ఇంటింటి తిరుగుతూ కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే వార్డును అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని చెప్పారు. గతంలో ఓడినా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు ఒక అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు బొప్పిడి రఘునందన్ రెడ్డి, నూతి శివ, బండి వెంకటేష్, కందుల పుల్లయ్య, బుంగపట్ల వెంకటేష్, కందుల సత్తయ్య, సూర్నీల నరసింహ పాల్గొన్నారు.