Yadagirigutta : బీఆర్ఎస్లోకి శారాజీపేట కాంగ్రెస్ నాయకులు
బీఆర్ఎస్ పార్టీలోకి యాదగిరిగుట్ట పట్టణంలో భారీ చేరికలు జరిగాయి. ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజారం రవి గౌడ్, మాజీ సర్పంచ్ బెంజారం రజిని, కాంగ్రెస్ నాయకులు 300 మంది మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
– 300 మంది చేరిక
– గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన గొంగిడి సునీత, గొంగిడి మహేందర్రెడ్డి
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 30 : బీఆర్ఎస్ పార్టీలోకి యాదగిరిగుట్ట పట్టణంలో భారీ చేరికలు జరిగాయి. ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజారం రవి గౌడ్, మాజీ సర్పంచ్ బెంజారం రజిని, కాంగ్రెస్ నాయకులు చిలుకు రేణుక, దిలుకు వెంకటేశ్, నిరోకా, పుట్టల స్వామి, గణేశ్, బాలరాజు, అంజయ్య, పెండ్యాల ప్రకృతిరాజుతో పాటు 300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయన్నారు.
ఓటుతో రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టి సమయం ఆసన్నమైందన్నారు. ఎక్కడికి వెళ్లినా ఏ ఒక్క హామీ నెరవేరలేదని ప్రజలు బాదతో ఉన్నట్లు చెప్పారు. సకాలంలో విద్యుత్ రావడం లేదు, రైతుబంధు లేదు.. ఆసరా పెన్షన్ల పెంపు లేదు.. కల్యాణలక్ష్మీకి తులం బంగారం లేదు.. నిరుద్యోగ భృతి లేదు.. విద్యార్థినులకు స్కూటీలు రాలేదు. ఇలా అన్ని హామీల అమలులో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. పదేళ్ల పాలనలో దసరా పండుగ వస్తే బతుకమ్మ చీరెలను అందజేశాం. రెండేళ్ల కాలంలో ఒక చీరను సైతం ఇవ్వలేని అసమర్థ పాలనను రేవంత్రెడ్డి సాగిస్తున్నట్లు దుయ్యబట్టారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తే గెలుపు ఖాయమన్నట్టుగా వాతావరణం నెలకొన్నదన్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ కే జై కొడుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు మహిళలు, వృద్ధులు, రైతులకు ప్రభుత్వం బాకీ పడిందని, త్వరలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వ బాకీ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటుతో రేవంత్రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలన్నారు.
త్వరలో మరిన్ని చేరికలు
ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. అలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి అర్థగా ఉంటూ వస్తోందన్నారు. ఇప్పటికే శారాజీపేట గ్రామంలో దాదాపుగా కాంగ్రెస్ ఖాళీ అయ్యనట్టేనని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయం సమీపిస్తున్న సందర్భంగా మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఆలేరు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, పార్టీ సెక్రటరి జనరల్ రచ్చ రాంనర్సయ్య, కారాజీపేట బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ మహేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆశయ్య, సోషల్ మీడియా కన్వీనర్ శ్రీధర్, మాజీ ఉప సర్పంచ్ కంది మహేందర్, నాయకులు అశోక్ గౌడ్, శ్రీధర్ గౌడ్, శనిగరం రవి, కదాల బాలయ్య, రచ్చ కావ్య, సిద్దేశ్వర్, సముద్రాల కుమార్ పాల్గొన్నారు.

Yadagirigutta : బీఆర్ఎస్లోకి శారాజీపేట కాంగ్రెస్ నాయకులు
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

