ఆత్మకూరు( ఎం), అక్టోబర్ 24 : ఆత్మకూరు( ఎం) మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్తో పాటు కొరటికల్, పల్లెపాడు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని మద్దతు ధర పొందాలన్నారు, ఈ కార్యక్రమంలో తాసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ రాములు నాయక్, డీపీఎం బాలరాజు, ఏటీఎం నరసింహ, సీసీలు, కొమరయ్య, హరిబాబు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పల్లవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వినోద, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు శిరీష, శ్యామల, లక్ష్మి, స్వప్న పాల్గొన్నారు.