Govt Land | భువనగిరి, కలెక్టరేట్ మార్చ్ 10 : ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 8లోని రెండెకరాల భూమి అర్హులైన పేదలకు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేశ్ కోరారు. ఇవాళ నిరుపేదలైన అర్హులతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొలనుపాక గ్రామంలో అర్హులైన పేదలు అనేక రోజుల నుండి అద్దెలకుండి కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందన్నారు. కొలనుపాకలో గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ కట్టించిన పక్కన ప్రభుత్వ స్థలం రెండు ఎకరాల భూమి ఉందని గతంలో ఆలేరు ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేసి ఎమ్మార్వోకి వినతి పత్రం సైతం అందజేశామన్నారు.
ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇంటింటి సౌభాగ్యం అని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీలు ఇచ్చినప్పటికీ ప్రజా పాలనలో దరఖాస్తులు పెట్టుకున్న అనేకసార్లు దరఖాస్తులు ఇచ్చిన అర్హులైన పేదలకు ఇంటి స్థలాలుగానీ ఇందిరమ్మ ఇండ్లుగానీ రావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన పేదలకు 100 గజాలు ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, శాఖ కార్యదర్శి కొలనుపాక పొన్నబోయిన రవి, గిరబోయిన సామి, ప్రజానాట్య మండలి బాధ్యుడు పోతు ప్రవీణ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు మోతే భవాని, సంపత్, లక్ష్మి, భిక్షపతి, కవిత, ఉప్పలమ్మ, యాదమ్మ, లక్ష్మి, ఎల్లమ్మ, దార ఓదయ్య, రామనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు