రాజాపేట, డిసెంబర్ 31 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. రాజాపేట మండల కేంద్రంలో జూనియర్ ప్రభుత్వ కళాశాల లేక ఎంతోమంది విద్యార్థులు చదువుకు దూరమైతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో చదువులను మధ్యలోనే నిలిపిస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో కళాశాల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.