– బోగారం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరిక
రామన్నపేట, డిసెంబర్ 2: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అభ్యర్ధులు ఓటును అభ్యర్ధించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం అంతటి రమేశ్ ఆధ్వర్యంలో బోగారం గ్రామానికి చెందిన కూనూరు సాయికుమార్‌తో పాటు 50 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. వీరికి చిరుమర్తి లింగయ్య గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బోగారం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా కూనూరు సాయికుమార్ గౌడ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కిన విధానాన్ని విస్కృతంగా ప్రచారం చేయాలన్నారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమారమేశ్, నాయకులు కూనూరు శ్రీనివాస్, కందగట్ల శ్రీనివాస్, కోడి పాండునాధ్, గుర్రం భిక్షపతి, కడారి మల్లేశం, కూనూరు బక్కులు, బొడ్డుపల్లి రాజు, వనం నర్సింహ్మ, కూనూరు శంకరయ్య, నేరటి రమేశ్, వనం శంకరయ్య, జెల్ల గోపాల్, మేడి ఆంజనేయులు, మేడి లింగస్వామి పాల్గొన్నారు.

Ramannapet : ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య