యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్ 25 : క్రీడలు, క్రీడాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగా ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడి అన్నారు. మండలంలోని వంగపల్లిలో యాదాద్రి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రేస్బాల్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వంగపల్లి గ్రామానికి క్రీడల్లో 50 ఏండ్ల నుంచి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. 35 ఏండ్ల క్రితం వంగపల్లిలో పెద్ద ఎత్తున క్రీడోత్సవాలు నిర్వహించారని, బాల్ బ్యాడ్మింటన్‌లో రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి లభించిందన్నారు. క్రీడలను ప్రోత్సహించడం ప్రతి ఒకరి బాధ్యత అన్నారు. వంగపల్లిలో యువకుల కోసం ప్రత్యేక జిమ్ ఏర్పాటు చేశామన్నారు. మహేంద్ర యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల నుంచి 50 జట్లు రావడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్లో మొదటి ప్రైజ్ రూ 1.50 లక్షలు, రన్నరప్ జట్టుకు లక్ష రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు.
యాదాద్రి ఏసీసీ కోట్ల నర్సింహారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మొదటి రోజు ఉప్పల్ లయన్స్, సూర్యాపేట క్లబ్ జట్ల మధ్య పోటీ జరిగింది. కార్యక్రమంలో సన్ సిటీ వెంచర్ ఎండీ జడపల్లి నారాయణగౌడ్, మదర్ డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, రూరల్ సీఐ నవీన్ రెడ్డి, యాదగిరిగుట్ట ఎస్ఐ సైదయ్య, ఆలేరు మారెట్ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ అనూరాధ, ఎంపీటీసీ మౌనిక, ఉప సర్పంచ్ స్వామి, కేసరి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలనర్సయ్య, పీఈటీ పూల నాగయ్య, టోర్నమెంట్ ఆర్గనైజర్లు కానుగు రాజీవ్‌గౌడ్, నరేశ్‌గౌడ్, గోపికృష్ణ, ఎం.నాగరాజు, జోగు రాజు, బొట్టు రాజు మహేంద్ర, యువసేన సభ్యులు ఎండీ అజ్జు, లక్ష్మణ్, హబీబ్, భాసర్, మహేశ్, నరేశ్, రఘువరన్ పాల్గొన్నారు.