మోటకొండూరు, ఆగస్టు 19: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కృషితోనే చెరువుల్లో జలకళ సంతరించుకుందని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి (Gongidi Sunitha) అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే రైతుల సంతోషంగా ఉన్నారని, మిషన్ కాకతీయ పథకంతో చెరువులన్నీ నిండుకుండలా మారడంతో రైతులు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. మోటకొండూరు ఊర చెరువు అలుగు పారుతున్న సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సహకారంతో రూ.250 కోట్ల మిషన్ కాకతీయ నిధుల ద్వారా చెరువులు బాగు చేసుకోవడం జరిగిందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూమండ్ల ఐలయ్య, పన్నాల అంజిరెడ్డి, సిరబోయిన నర్సింగ్ యాదవ్, మాల్గ గౌరయ్య, భూమండ్ల సుధీర్, బొబ్బలి యాదిరెడ్డి, బోట్ల నరసింహ, ఎండి బురాన్, భూమండ్ల యాదయ్య, భూమండ్ల బీరయ్య, జివిలికపల్లి వెంకటేష్, బొట్ల పాండు, నల్ల జాహాంగీర్, బొట్ల ప్రశాంత్ , వంగపల్లి సురేష్, మోకాల అనంతరెడ్డి, బుగ్గ బాలరాజు, బోలగాని లక్ష్మీనారాయణ, పైళ్ళ పాండురంగారెడ్డి, సీస ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.