రాజాపేట మే 08 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, జలసాధన సమితి అధ్యక్షుడు ఎర్రగోకుల జస్వంత్, పార్టీ సెక్రెటరీ జనరల్ సందిల భాస్కర్ గౌడ్, మాజీ ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, చింతలపూరి భాస్కర్ రెడ్డి, చింతలపూడి వెంకటరామిరెడ్డి, కాకల్లా ఉపేందర్, సందేల వెంకటేశ్, బెదిదే వీరేశం, బూరుగు నర్సిరెడ్డి, గుర్రం నరసింహులు, ములుగు సోమలింగం, ఉప్పలయ్య, సకినాల ఉపేందర్, గంధ మల్ల సురేశ్, గజ్జల రాజు, చెరుకు కనకయ్య, రాజు, ఉపేందర్, పెద్దలు, మోత్కుపల్లి బాలకృష్ణ, వరిమడ్ల బాలకృష్ణ, ఏమ్మా భాస్కర్, లక్ష్మణ్ నాయక్, కనకయ్య పాల్గొన్నారు.