ఆలేరు టౌన్,జూలై 30 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మాజీ డిసిసిబి చైర్మన్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని వడ్డెర బస్తీ కాలనీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దండుగుల యాదగిరి ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మహేందర్రెడ్డి బుధవారం యాదగిరి భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యాదగిరి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరి అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి, కాలనీవాసులకు తీరని లోటు అని అన్నారు. పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మంతపురి మాజీ సర్పంచ్ కర్రె ఎల్లయ్య, మాజీ కౌన్సిలర్ బేతి రాములు, జూకంటి ఉప్పలయ్య, జింకల రామకృష్ణ, దయ్యాల సంపత్, చిమ్మి శివమల్లు, అంగడి ఆంజనేయులు, ఆలేటి పాండు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.