రాజాపేట, సెప్టెంబర్ 16 : ఆలేరు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. మంగళవారం రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా దూది వెంకటాపురంలో పాఠశాల ప్రహరీ గోడ, అదనపు తరగతి గది, నెమిలే లో సీసీ రోడ్డు, రఘునాధపురంలో అంగన్వాడీ కేంద్రం, కుర్రారం, సింగారం గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుడిగ పెంటయ్య గౌడ్, ఇంజ నరేశ్, రేగు సిద్ధులు, బల్ల యాదేశ్, బీజన నరేందర్ వెంకటేశ్, కనకరాజు పాల్గొన్నారు.