ఆలేరు టౌన్, మార్చి 3 : ఆలేరు పట్టణానికి చెందిన డివైఎఫ్ఐ(DYFI) జిల్లా ఉపాధ్యక్షుడు, సీపీఎం పట్టణ కమిటీ నాయకుడు భోనగిరి గణేష్ మృతి చెందాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గణేష్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ నాయకుడు ఎం.ఎ.ఇక్బాల్ మాట్లాడుతూ గత నెల 20న అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
ఈ క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో గణేష్ మృతి చెందినట్లు పేర్కొన్నారు. అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం మూడు గంటలకు ఆలేరు పట్టణంలోని రంగనాయక వీధిలో తన నివాసం వద్ద నిర్వహిస్తామని ఇక్బాల్ తెలిపారు. పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొని నివాళులు అర్పించాలని సూచించారు.