ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 15 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ను రద్దు చేయాలనీ సిపిఐ ఆత్మకూరు(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి అనంతరం ఆర్ఐ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మారుపాక వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉప్పల ముత్యాలు మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. తరతరాలుగా అణిచివేత, వివక్షతకు గురౌవుతున్న బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాలంటే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు జక్క దయాకర్ రెడ్డి, సోలిపురం లింగారెడ్డి, గుర్రం రాజమణి, మారుపాక అంజయ్య, మండల నాయకులు నరసయ్య, కిష్టయ్య, పురుషోత్తం, రాములు, చంద్రయ్య, ధనలక్ష్మి పాల్గొన్నారు.