భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 06 : దొంగ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లిలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఇన్చార్జి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డి, తుంగ బాలుతో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాలన్నారు. పట్టణాలు, గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే పేద ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీత వెంకటేష్, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మాజి వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, మాజీ జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, నాయకులు ముత్యాల మహిపాల్ రెడ్డి, చిలువేరు బాల నరసింహ, గోరంటి ప్రదీప్ రెడ్డి, బత్తుల శ్రీశైలం, మాధవరెడ్డి, కర్ణాటి రవీందర్, మక్బూల్, రుద్ర శ్రీశైలం, చంద్రశేఖర్, గుండు మధు, చింతకింది శ్వేత కిరణ్, కర్నాటి వరలక్ష్మి నరసింహ, సీత శ్రవణ్, గునిగంటి మల్లేష్, గుండు ప్రవీణ్, కుడికాల, అఖిల బలరాం, రాపోలు వేణు, దేవరాయ శివలింగం, పెద్దల చక్రపాణి, చేరాల లహరి కిరణ్, జల్ది అంజమ్మ నరసింహ, వేముల సుమన్, వంగురి పెంటయ్య, భారత గిరి, పగిడిమర్రి రాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

దొంగ హామీలతో కాంగ్రెస్ మోసం : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి