బీబీనగర్, అక్టోబర్ 09 : రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ బీబీనగర్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు అన్నారు. గురువారం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే నేపథ్యంలో ఆయన మాట్లాడారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్యాయం చేశారన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంపై చిత్తశుద్ధి, సరియైన ప్రణాళికలు లేకపోవడంతో హైకోర్టులో జీఓ నంబర్ 9 పై నాలుగు వారాల పాటు స్టే విధించినట్లు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. చట్టబద్ధత లేని 42 శాతం రిజర్వేషన్ అమలు జరగదు అని తెలిసి కూడా రాష్ట్రంలో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందన్నారు.
కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరొక్కసారి బీసీలను మోసం చేద్దామనుకోవడం మానుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమించి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు గోరుకంటి బాలచందర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల అశోక్, బిఆర్ఎస్వి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నాగేష్, నాయకులు అమృతం శివకుమార్, కొంతం భాస్కర్ గౌడ్, ఎండి మిట్టు, భానోత్ నరేందర్ నాయక్, దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దేవరకొండ శ్రీనివాస్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, రామ్ శర్మ, వంగరి పరంకుశం, కొండ శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.