సీఎం కేసీఆర్ సోమవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకోనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను కేసీఆర్ ఈసందర్భంగా పరిశీలించనున్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా జరుగుతున్న పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.