భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 14 : ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి. బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.