భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 20 : భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలమయమై ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు బుధవారం కంకర, సిమెంట్‌తో రోడ్డు గుంతలను పూడ్చివేశారు. భీమనపల్లి ప్రధాన రహదారి గుంతలుగా మారడంతో ప్రయాణించే వాహనాలు ప్రమాదాలు తరచుగా గురికావడంతో ప్రభుత్వ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. గమనించిన స్థానిక బీఆర్ఎస్ నాయకులు శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కోట మల్లారెడ్డి, శంభారెడ్డి, కలుకూరి పాండు, చిలువేరు శేఖర్, ఏనుగు వెంకట్ రెడ్డి, తడకపల్లి ప్రవీణ్ రెడ్డి, ఈరటి మల్లేశ్, కలుకూరి హరికృష్ణ, రాసాల సాయి, రాజు, శేషు పాల్గొన్నారు.