రామన్నపేట, అక్టోబర్ 18 : రామన్నపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బీసీ బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, విద్య, ఉపాధి, బీసీ సబ్ ప్లాన్ కాంట్రాక్టుల్లో 42 శాతం వాటా హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిపోతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు పోషబోయిన మల్లేశం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపీటీసీలు సాల్వేర్ అశోక్, పున్న వెంకటేశం, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, బద్దుల రమేశ్, అంతటి రమేశ్, ఎస్కే చాంద్, నాయకులు కోనూరు శ్రీనివాస్, పోతరాజు శంకరయ్య, మిర్యాల మల్లేశం, బొడ్డు అల్లయ్య, ఆవుల శ్రీధర్, గర్దాస్ విక్రమ్, గుండాల రాంబాబు, జెట్టి సైదులు, ఎండీ ఆజాద్, ముక్కామల నరేందర్, బొడ్డుపల్లి రాజు, మోటి రవీందర్, బొలుగుల కృష్ణ, కేస వీరస్వామి, మోటి నరేశ్, వంగాల యాదయ్య, వర్కల రమేశ్, నల్ల సైదులు, ఎండీ అంజద్, గట్టు శేఖర్, గట్టు నరేశ్, గాదె శంకర్, నోముల శంకర్, రాము నరేశ్, రాజు, శంకరయ్య పాల్గొన్నారు.