రామన్నపేట, అక్టోబర్ 17 : బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించే బంద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రామన్నపేట మండలాధ్యక్షుడు పోసబోయిన మల్లేశం పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఅర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమారమేష్ యాదవ్, సోషల్ మీడియా మండల కన్వీనర్ ఆవుల శ్రీధర్ పాల్గొన్నారు.