– ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి
యాదగిరిగుట్ట, నవంబర్ 10 : తెలంగాణ సహజ కవి అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. అందెశ్రీ మరణం పట్ల సోమవారం ఆయన స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ రచించి అందెశ్రీ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన రచించిన అనేక గేయాలు రాష్ట్ర ప్రజలు, యువతను ఊర్రూతలుగించినట్లు తెలిపారు. రచనల రూపంలో రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబానికి అండగా నిలువాలని కోరారు.