నేరేడుచర్ల, జూన్ 14 ; పలువురు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరిగి వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈక్రమంలో ప్రమాదాల నియంత్రణకు పోలీస్‌శాఖ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టింది. బ్రీత్ ఎనలైజర్లతో ఆల్కహాల్ పరీక్ష చేసి మద్యం తాగిన వారిపై కేసులు నమోదుచేసి జైలుశిక్ష పడేలా చేస్తున్నది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం జనవరి నుంచి మే వరకు సుమారు 6,424 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. జరిమానాలతో ప్రభుత్వానికి రూ.40.85 లక్షల ఆదాయం రాగా, మొత్తం 33 మందికి జైలుశిక్ష పడింది. డంకెన్డ్రైవ్తో వాహనదారుల్లో కొంత మార్పు వచ్చిందని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
జంకుతున్న వాహనచోదకులు
గతంతో పోలిస్తే వాహనచోదకులు రాత్రి అవుతుందంటే చాలు.. డ్రంకెన్ డ్రైవ్ కేసులతో జంకుతున్నారు. వాహనచోదకులకు సైతం అవగాహన కలగడంతో వారిలోనూ మార్పు వస్తున్నది. పోలీసుల చర్యలతో నాలుగుచక్రాల వాహనదారులు డ్రైవర్ లేకుండా ప్రయాణం చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నవారికి జరిమానా తప్పదని తెలిసి చాలామంది తాగి నడపడం తగ్గించారు. మరికొందరు మద్యం సేవించి పోలీసులు ఉన్నవైపు వెళ్లకుండా ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు.
పోలీసుల అవగాహన కార్యక్రమాలు
మద్యం సేవించి వాహనాలను నడపంతో కలిగే అనర్థాలు, నష్టాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం పోలీస్స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ బ్రీత్ ఎనలైజర్‌తో ఆల్కహాల్ పరీక్ష చేసి తాగిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆటో, కారు స్టాండ్ల వద్ద, ప్రజలు రద్దీగా ఉన్నచోటకు వెళ్లి పోలీసులు అవగాహణ కల్పిస్తున్నారు. అయినా, కొంతమందిలో మార్పు రాకపోవడం గమనార్హం. మద్యం తాగి
వాహనాలు నడపొద్దు వాహనదారులు ఎట్టిపరిస్థితుల్లో మద్యం తాగి వాహనాలు నడపొద్దు. అలా చేస్తే చట్టరీత్యా నేరం. అంతేకాకుండా అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే కుటుంబాలు వీధిన పడతాయి. మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడితే న్యాయస్థానాలు జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తాయి.