Jan Pahad Dargah | పాలకవీడు మార్చి 23 : సూర్యాపేట జిల్లా హుజూర్‌గర్ నియోజకవర్గం పాలకువీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా గ్రామంలో జాన్పాడు దర్గా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జానపాడు దర్గా గ్రామంలో సైదులు బాబా సమాధులను మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు జిల్లాలోని పలువురు శాసనసభ్యులు దర్శించుకున్నారు.
దర్గా ముజావర్ జానీ మంత్రులకు, శాసనసభ్యులకు దర్గా సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం సైదులు బాబా సమాధుల వద్ద ప్రత్యేక చాదర్ సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హిందూ ముస్లిం ఐక్యతకు ప్రత్యేక జాన్ పహాడ్ దర్గాను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నతమైన దర్గా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. రానున్న రోజుల్లో దర్గా అభివృద్ధికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల షామిల్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటకరంగా అభివృద్ధి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు