TTD | దర్శన క్యూలైన్లో పాము కాటు ప్రచారం అవాస్తవం : టీటీడీ
TTD | తిరుమలలో దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు అని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని టీటీడీ వెల్లడించింది.
తిరుమల : తిరుమలలో దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు( Snake Bite ) అని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని టీటీడీ( TTD) వెల్లడించింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ( Tirumala ) వచ్చారని వివరించారు.
ఈ నేపథ్యంలో ట్యాక్సీలో మ్యూజియం సమీపాన ఉన్న ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియాకు చేరుకోగానే మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిలో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్లిందన్నారు. ఈ క్రమంలో కాలుపై స్పర్శ తగలడంతో భయపడి భర్త శరత్ వివరించగా ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము కనిపించిందన్నారు.
వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారని, వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి పాము కాటు లేదని నిర్ధారించారని వివరించారు. అయినప్పటికీ మహిళా భక్తురాలి ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారని వెల్లడించారు. ఆ పాము కూడా విషపూరితం కాదని విచారణలో తేలిందన్నారు. సోమవారం ఉదయం దంపతులు క్షేమంగా శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు.
భక్తులు తమ భద్రత దృష్ట్యా టీటీడీ నిర్దేశించిన ప్రాంతాల నుంచి మాత్రమే క్యూలైన్లలోకి వెళ్లాలని, తిరుమల పరిసరాల్లోని నిషేధిత అటవీ ప్రాంతాల్లో సంచరించవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది .
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

