Employment guarantee scheme | మునుగోడు, మార్చి 5 : ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు ఎండీ జానీమియా విమర్శించారు. మునుగోడు మండల పరిధిలోని పులి పులుపుల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఉపాధి హామీ పథకం పనులలో భాగంగా పనుల దగ్గర కనీస అవసరాలు అయినా మంచినీరు మెడికల్ కిట్టు పార గడ్డపార ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలని.. జాబ్ కార్డ్ నిమిత్తం లేకుండా ఆత్మీయ రైతు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం మునుగోడు మండల కార్యదర్శి కాగితవెంకన్న మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించి రోజువారి వేతనం 700 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇల్లు స్థలాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణంచేపట్టాలని గృహలక్ష్మి పథకంలో అప్లై చేసుకున్న వారందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొలూగురి ఎల్లయ్య, కొంపెల్లి రాములు, పందుల యాదయ్య, సింగం యాదయ్య, సింగం లింగయ్య, సింగం లింగమ్మ, పగిళ్ల లింగమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు