MLA Beerla Ilaiah | ఆలేరు టౌన్, మార్చి 8: సమాజ అభ్యున్నతి మహిళలతోనే సాధ్యమని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని నెహ్రూ యువ కేంద్రం యాదాద్రి భువనగిరి సౌజన్యంతో స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ ఆలేరు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటమ్మ అధ్యక్షతన ఇవాళ సమావేశం నిర్వహించారు.
ఇల్లాలు చదువుకుంటే ఇల్లు బాగుపడుతుందన్నారు. సమాజంలోని మహిళలందరూ చదువుకుంటే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మహిళలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. బాలికలు విద్యార్థి దశ నుండే మంచిగా చదవాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలను, కళాశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అంతకుముందు జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు, బాలికలకు శుభాకాంక్షలు తెలిపి అనంతరం కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా పిడి పూల నాగయ్య మాట్లాడుతూ.. బాలికలు విద్యార్థి దశ నుండే క్రీడల్లో రాణించాలన్నారు. భారతదేశంలో ఎంతోమంది మహిళలు ఉన్నత శిఖరాలను, ఉన్నత స్థానాలను అధిరోహించారని తెలిపారు. భారతదేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో గరేబి హటావో నినాదంతో రోటి, కపడా,మకాన్ కల్పించడమే ధ్యేయంగా పరిపాలన కొనసాగించారని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు పూల నాగయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, తెలంగాణ భాష అభివృద్ధి బాధ్యులు చింత కింది కృష్ణ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పరిగెల రాములు, కాంగ్రెస్ నాయకులు, ఎజాజ్, పాము అనిత, ఉపాధ్యాయులు గంగాధరి శ్రావణ్, ఫ్రెండ్స్ క్లబ్ సహాయ కార్యదర్శి పూల చంద్రకుమార్ సభ్యులు యాట సందీప్, కళాశాల మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్