Jagadish Reddy | నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన రైతు మహాధర్నాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్‌కు ముందు రైతులు ధర్నా చేయని రోజూ లేదు. కానీ మళ్లీ ఇవ్వాళ 12 ఎండ్ల తర్వాత అదే పరిస్థితి. కాంగ్రెస్ చేసిన పాపం… రేవంత్ సర్కార్ చేసిన శాపంతో రైతులు మళ్ళీ ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ జిల్లాలో ఊరూరు తిరిగి కష్టాలు చూశారు.
అందుకే అప్పుడే కేసీఆర్ నల్లగొండపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని భావించారు. అందుకే ప్రత్యేక విజన్‌తో కేసీఆర్ జిల్లాను అభివృద్ధి చేశారు. 2013లో 3 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కేసీఆర్ హయాంలో 2023లో 40 లక్షలకు జిల్లా ధాన్యం ఉత్పత్తి పెరిగింది. మధ్యలో మోదీ కొనుగోలు చేయనని అంటే.. ఏకంగా ఢిల్లీలో ప్రభుత్వాన్ని తీసుకెళ్లి ధర్నా చేసిన ఘనత కేసీఆర్ దన్నారు.
రైతులను చైతన్యం చేసి… పంటలను పడించే ప్రయత్నం చేశారు.పంటల కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టి చివరి గింజ వరకు కొనిపించారు.తడిసిన ధాన్యం సైతం భేషరతుగా కొనిపించారు.దేశమంతా కరోనాతో ఇబ్బంది పడుతుంటే..కల్లాల వద్దకు వెళ్లి కేసీఆర్ కొనిపించారు.కానీ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డిని నమ్మి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.చెప్పు తీసుకొని కాంగ్రెస్ పార్టీని, రేవంత్ సర్కార్‌ను కొట్టాలని మాజీ మంత్రిజగదీష్ రెడ్డి మండిపడ్డారు.
సివిల్ సప్లై శాఖ మంత్రికి సోయి లేదు. కనీసం రివ్యూ చేసే తీరిక లేదు.తరుగు పేరుతో రైతులను దోచుకుంటుంటే పట్టడం లేదు.క్వింటాల్‌కు పది కిలోలు కట్ చేస్తున్నారు.కానీ మంత్రులు అడ్రెస్స్ లేరు.కటింగ్ పెట్టడం కూడా మంత్రులకు తెలిసే జరుగుతుంది. మిలర్ల వద్ద కమిషన్లు దొబ్బడానికే మంత్రులుమౌనంగా ఉంటున్నారు.జిల్లాకు చెందిన ఇద్దరూ మంత్రులు ఎలా దోచుకోవాలి… దాచుకోవాలి అన్నధ్యాసనే.మోదీ, చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్నది.అసలు కాంగ్రెస్ వాళ్ళు మనతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, దోపిడీ ఆపాలని డిమాండ్ చేశారు.
ఈ రోజు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మోడీ, చంద్రబాబుకి పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్
ఈ హైబ్రిడ్ గాళ్లతో ఉండే బదులు రేపు బీఆర్ఎస్ తోనే వస్తామని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకార్తలు చెబుతున్నారు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి pic.twitter.com/FkqqXzevPJ
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2026
Watch: గన్ గురిపెట్టి జ్యుయలరీ షాపులో దోపిడీకి యత్నం.. సిబ్బంది ఏం చేశారంటే?
Road accident | రోడ్డు పక్కన రాతి గోడను డీకొట్టిన కారు.. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం
జూలూరుపాడులో ఘనంగా ‘టూ కే రన్’