Kattangur | కీడు సోకిందని ఊరంతా ఖాళీ.. గ్రామస్థుల వనవాసం
Kattangur | గత సంవత్సరం కాలంగా వరుస మరణాలు సంభవిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళకు గురయ్యారు. వివిధ కారణాలతో ఒక తరువాత మరొకరు చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ప్రాణాలు కోల్పోవడం ఆ ఊరిని కుదిపేసింది.
Kattangur | కట్టంగూర్, ఏప్రిల్ 12 : ఆ ఊరిలో కొంతకాలంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఊహించని పరిణామాలు ఆ గ్రామస్థుల్లో భయాన్ని నింపాయి. దీంతో ఆ గ్రామ ప్రజలంతా ఊరు విడిచి వనవాసాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వివరాల్లోకి వెళితే..
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో గత సంవత్సరం కాలంగా వరుస మరణాలు సంభవిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళకు గురయ్యారు. వివిధ కారణాలతో ఒక తరువాత మరొకరు చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ప్రాణాలు కోల్పోవడం ఆ ఊరిని కుదిపేసింది. ఏడాది కాలంగా వరుసగా చోటు చేసుకుంటున్న మరణాలు గ్రామస్తుల మనస్సుల్లో భయం నింపాయి. అవి సహజ మరణాలా..? లేక అనారోగ్యంతో ప్రాణాలు వదులుతున్నారా..? లేక కీడు వల్ల చనిపోతున్నారో తెలియక ఆందోళనకు చెందారు. దీంతో గ్రామ పంచాయతీ పాలకవర్గంలో పాటు గ్రామపెద్దలు పురోహితున్ని సంప్రదించారు.
జాతకాలు, గ్రామ పరిస్థితులను పరిశీలించి గ్రామానికి కీడు సోకిందని ఒక రోజు గ్రామస్తులంతా వాకిళ్లు ఊడ్చకుండా, కల్లాపి చల్లకుండా ఊరు విడిచి వనవాసాలకు (కీడు వంటలకు) వెళ్లాలని సూచించారు. ఆదివారం వనవాసాలకు వెళ్లాలని గ్రామంలో మూడు రోజుల క్రితమే డప్పు, చాటింపు చేశారు. దీంతో ఉదయం ఐదు గంటలకే గ్రామస్తులంతా ఇండ్లకు తాళాలు వేసి పిల్లాపాపలతో కలిసి పొలిమేరల వెలుపలికి వెళ్లి సంప్రదాయ బద్దంగా వంటలు చేసుకుని అక్కడే తిని సాయంత్రం 5గంటలకు ఇండ్లకు తిరిగి వచ్చారు. గ్రామస్తుంతా వనవాసం వెళ్లడంతో గ్రామం నిర్మానుష్యంగా కనిపించింది.
Read Also :
Macherla ASI | ఏకాంతంగా ఉన్న జంటలను రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. మాచెర్ల ఏఎస్సై నిర్వాకం
Asha Bhosle | బాలీవుడ్లో విషాదం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి
Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

