Macherla ASI | ఏకాంతంగా ఉన్న జంటలను రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. మాచెర్ల ఏఎస్సై నిర్వాకం
Macherla ASI | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం పల్నాడు జిల్లా (Palnadu District) లో ఓ ఏఎస్సై నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. పర్యాటక ప్రాంతాల్లోని పార్కుల్లో ఏకాంతంగా గడుపుతున్న జంటలను మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్ (ASI Srinivas) రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Macherla ASI : ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం పల్నాడు జిల్లా (Palnadu District) లో ఓ ఏఎస్సై నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. పర్యాటక ప్రాంతాల్లోని పార్కుల్లో ఏకాంతంగా గడుపుతున్న జంటలను మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్ (ASI Srinivas) రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏఎస్సై దందాకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమికులు, కళాశాల విద్యార్థులే లక్ష్యంగా ఏఎస్సై శ్రీనివాస్ దందాలకు పాల్పడుతున్నాడు. జమ్మలమడుగుకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌తో జంటలు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీయించి, వారిని స్టేషన్‌కు తీసుకెళ్తానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వలేని యువతులను తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధిస్తున్నట్లు కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల మాచర్లలోని ఓ వ్యాపారి, ఓ మహిళతో ఏకాంతంగా ఉన్న వీడియో తీసి, వారిని బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాచర్ల పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్న మరో ఎస్సై, కానిస్టేబుల్‌కు కూడా ఈ దందాలో భాగం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కృష్ణారావు స్పందించారు. విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

