హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. తెలంగాణలో విద్య, పెట్టుబడులు, ఉపాధి కల్పన, సాంకేతికరంగాల్లో సహకారంపై చర్చించారు. విద్యార్థుల వీసా స్లాట్లు పెంచాలని, హెచ్-1బీ వీసా ప్రక్రియను సరళీకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అమెరికా కంపెనీల పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రేవంత్‌రెడ్డి వివరించారు.