Asha Bhosle | బాలీవుడ్లో విషాదం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి
Asha Bhosle | బాలీవుడ్లో విషాదం నెలకొంది. దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) అనారోగ్యంతో కన్నుమూసింది.
Asha Bhosle | భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత స్వర శకం ముగిసింది. దిగ్గజ గాయని, పద్మ విభూషణ్ గ్రహీత ఆశా భోంస్లే (92) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. శనివారం సాయంత్రం తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె, పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తొలుత ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వార్తలు వచ్చినప్పటికీ, ఆదివారం మధ్యాహ్నం ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే మరణవార్తను అధికారికంగా ధృవీకరించారు. ఎనిమిది దశాబ్దాల పాటు 20కి పైగా భాషల్లో వేల పాటలతో కోట్లాది మందిని అలరించిన ఆమె మరణంతో బాలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, భారతరత్న లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోంస్లే అంతిమ సంస్కారాలు సోమవారం ముంబైలోని శివాజీ పార్క్‌లో పూర్తి ప్రభుత్వ అధికారాలతో నిర్వహించనున్నారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ, సంగీత ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | సినిమాల విషయంలో రూటు మార్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇకపై వరుస సినిమాలతో బిజీ బిజీ!
India-US trade deal | భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. కీలక అంశాలు..!
Terrorist Arrested | ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది అరెస్ట్.. ఏకే-47 స్వాధీనం
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

