Inter Supplementary Exams | ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 13వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల ఫీజు చివరి గడువును ఏప్రిల్ 20వ తేదీగా నిర్ణయించారు.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనికి ఏప్రిల్ 20 చివరి తేదీ. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు, మే 22వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. రెండుసెషన్స్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.