Nalgonda | గట్టుప్పల్, ఫిబ్రవరి 10: మండలంలోని వెల్మకన్నే గ్రామ పంచాయతీని రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీకి రిజర్వ్ చేయాలని ఆ గ్రామ దళిత నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామ పంచాయతీని సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులకై ఎస్సీ రిజర్వుడు చేయాలని ఆ గ్రామ దళిత నాయకులు ఇవాళ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో 70 సంవత్సరాల నుంచి గ్రామపంచాయతీకి ఎన్నికల జరుగుతున్నాయని.. కానీ ఒక్కసారి కూడా సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులకు ఎస్సీకి రిజర్వుడ్ కాలేదనీ వాపోయారు. జనరల్, జనరల్ మహిళ, బీసీ, బీసీ మహిళకు మాత్రమే రిజర్వేషన్ చేయడం జరిగిందన్నారు. గ్రామంలో జనాభాపరంగా కానీ ఓట్ల పరంగా కానీ 32% మంది దళితులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.. కానీ ఇంతవరకు ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్పంచ్‌గా కానీ ఎంపీటీసీగా కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా దళితులకు అవకాశం రాలేదన్నారు. గ్రామంలోని ఎస్సీలంతా ఒక తాటిపైకి వచ్చి గ్రామపంచాయతీని ఎస్సీ రిజర్వుగా మార్చేలా పోరాటం చేస్తామన్నారు. త్వరలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితోపాటు అన్ని పార్టీల నాయకత్వాన్ని కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల యాదయ్య, రాంపల్లి తిరుమలేష్, శంకరయ్య, ఆవుల ప్రేమ సుందర్, భీమనపల్లి సైదులు, భీమనపల్లి శంకర్, పసుపులేటి రవీంద్రబాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు టేకుమట్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్