e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home జిల్లాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలి

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

  • ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండాలి
  • మండల సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబర్‌ 22 : గ్రా మాల్లోని ప్రజలు, రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి.. ప్రజాప్రతినిధులతో సమన్వయంగా మెలుగుతూ ప నిచేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. లేదంటే సెలవు పెట్టి వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఎన్నుకు న్న ప్రజాప్రతినిధులతోనూ అధికారులు మమేకమై అభివృద్ధి చేయాల్సిన అవస రం ఉన్నదన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులు ఉద్యోగాలు మానేయాలన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ నర్సింహారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరు కాగా ముందుగా సమావేశంలో వ్యవసాయంపై చర్చ జరిగింది. బొందలపల్లి సర్పంచ్‌ మల్లేపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మండల వ్యవసాయాధికారి నర్మద రైతులతో సమన్వయంతో పనిచేయడం లేదని, ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చే యడం లేదన్నారు. దీంతో ఏవోపై ఎమ్మె ల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందుబాటులో ఉండి పనిచేయాలని, మీవల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే ఉద్యోగం వదిలి వెళ్లాలన్నారు. ఏ గ్రామంలో తిరిగి రైతులు సమస్యలు తెలుసుకున్నారని ప్రశ్నించారు. మండలంలోని చాలా గ్రా మాల నుంచి మీపై ఫిర్యాదులు వస్తున్నాయని, సరిచేసుకోకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. మండల అధికారిగా ఏ రైతు ఫోన్‌ చేసినా సలహాలు ఇవ్వాల్సిందిపోయి పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మరోసారి రైతుల నుంచి గానీ, ప్రజాప్రతినిధుల నుంచి గా నీ, మీపై ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు సీజన్ల వారీగా కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందిం చే బాధ్యత వ్యవసాయాధికారులపై ఉన్నదని సూచించారు. వచ్చే సీజన్‌కు మండలానికి కావాల్సిన విత్తనాల కోసం ఇం డెంట్‌ పంపించారా? అని ప్రశించారు. రైతు ఏ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నరనే విషయాలను తెలుసుకొని సరైన సమయంలో వాటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్ర స్తుతం ఫుడ్‌ కార్పొరేషన్‌ వడ్లు కొనే పరిస్థితి లేదని, ప్రభుత్వం సూచించిన సన్న రకాలను పండించేందుకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం విద్యుత్‌, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, పశుసంవర్ధక తదితర శాఖల పై ప్రగతి సమావేశంలో చర్చించారు. కా ర్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కు ర్మయ్య, జెడ్పీటీసీ శ్రీశైలం, విండో చైర్మ న్‌ శ్రీనివాస్‌రెడ్డి, అధికారి కోటేశ్వర్‌రా వు, అన్ని శాఖల మండల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement