e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home నాగర్ కర్నూల్ ఘనంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

కల్వకుర్తి, ఏప్రిల్‌ 27: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రసమితి జెండాలను ఎగురవేశారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో చైర్మన్‌ ఎడ్మ సత్యం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్‌ తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశారు. కార్యక్రమాల్లో మార్కెట్‌ చైర్మన్‌ బాలయ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ శ్రీశైలం, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌, కౌన్సిలర్లు బోజిరెడ్డి, సైదులుగౌడ్‌, బాలునాయక్‌, స్పెషల్‌ నాలెడ్జ్‌పర్సన్‌ మనోహర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రుక్నుద్దీన్‌, మధు, శ్రీనుయాదవ్‌, సత్యం, లక్ష్మయ్య, తెలంగాణ జాగృతి నాయకుడు గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

చారకొండ మండలంలో..
చారకొండ, ఏప్రిల్‌ 27: టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూపల్లిలో టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటయ్యయాదవ్‌, బాలేమియా, బోజ్జయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు సిరాజ్‌, కార్తీక్‌యాదవ్‌, మల్లేశ్‌, రాంచంద్రి, వెంకటయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

ఊర్కొండ మండలంలో..
ఊర్కొండ, ఏప్రిల్‌ 27: మండలకేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల అధక్షుడు గిరినాయక్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ అరుణ్‌కుమార్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు ఖలీం పాషా, గుణగుంట్లపల్లి సర్పంచ్‌ ఆంజనేయులు, మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులు, టీఆర్‌ఎస్‌ నాయకులు జంగయ్య, రవీందర్‌రెడ్డి, రమేశ్‌, గోపి, రవి, శ్రీను, అశోక్‌రెడ్డి, మల్లేశ్‌, రాజశేఖర్‌, లక్ష్మణ్‌, సందీప్‌, ప్రసాద్‌, శ్రీశైలంతోపాటు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉన్నారు.

ఉప్పునుంతల మండలంలో..
ఉప్పునుంతల, ఏప్రిల్‌ 27: మండలంలోని పెనిమిళ్లలో పార్టీ మండల అధ్యక్షుడు సుల్తాన్‌ అధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు స్వాతీఅశోక్‌గౌడ్‌, విజయ్‌, తిరుపతయ్యయాదవ్‌, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, పర్వత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, శేఖర్‌యాదవ్‌, రఫీ, లింగమయ్య, నాసిర్‌ పాల్గొన్నారు.

వంగూరు మండలంలో..
వంగూరు, ఏప్రిల్‌ 27: మండలకేంద్రంతో పాటు తుమ్మలపల్లి గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల నరేందర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు హమీద్‌, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, గణేశ్‌రావు, రాజేందర్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, యాదవసంఘం జిల్లా అధ్యక్షుడు లాలూయాదవ్‌, కేటీఆర్‌ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్‌, నాయకులు మదన్‌కుమార్‌రెడ్డి, నరేందర్‌గౌడ్‌, ఎల్లాగౌడ్‌, జంగయ్యతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లింగాల మండలంలో..
లింగాల, ఏప్రిల్‌ 27: లింగాల, బల్మూర్‌ మండలకేంద్రా ల్లో టీఆర్‌ఎస్‌ మండల నాయకులు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్‌కట్‌ చేసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రానోజీ, సింగిల్‌విండో చైర్మన్‌ హన్మంత్‌రెడ్డి, సర్పంచ్‌ తిరుపతయ్య, సింగిల్‌విండో వైస్‌చైర్మన్‌ వెంకటగిరి, డైరెక్టర్లు శ్రీనివాసులు, మాజీ డైరెక్టర్‌ మల్లేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాసులు, అజీం, హన్మంతునాయక్‌ పాల్గొన్నారు.

వెల్దండ మండలంలో..
వెల్దండ, ఏప్రిల్‌ 27: మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంజీవ్‌కుమార్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావు, సర్పంచులు పెద్దిరామకృష్ణ, అంజయ్య, నాయకులు యాదగిరి, కృష్ణారెడ్డి, శ్రీను, నిరంజన్‌, ప్రభాకర్‌, రంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

అమ్రాబాద్‌ మండలంలో..
అమ్రాబాద్‌, ఏప్రిల్‌ 27: మండలకేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి జెండావిష్కరణ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చెన్నకేశవులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఘనంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు

ట్రెండింగ్‌

Advertisement