డబ్బులు పంచుతూ పట్టుబడిన కాంగ్రెస్ అభ్యర్థి
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 26: అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీందర్ పట్టుబడ్డాడు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని వలపట్లకాలనీ (13వ వార్డు)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్టపాగ రవీందర్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులు పంచుతున్న రవీందర్‌ను అదుపులోకి తీసుకున్న సమయంలో అతడి వద్ద రూ.51వేలు ఉన్నట్లు ఎస్సై ప్రదీప్‌కుమార్ తెలిపారు. డబ్బులు పంచిన వ్యక్తిపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
పంజాబ్‌కు షాక్.. వరుస ఓవర్లలో 3 వికెట్లు డౌన్
మానవత్వం చాటుకున్న అంబులెన్స్ డ్రైవర్