Youth | వెల్దుర్తి, ఏప్రిల్ 09 : ఫైనాన్స్‌లో బైక్ కొనుగోలు చేసిన ఓ యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఫైనాన్స్ చెల్లించక పోవడంతో ఫైనాన్స్ వారు అతడి బైక్‌ను తీసుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన సదరు యువకుడు వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మానేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అక్కమొల్ల లలిత, లచ్చయ్య దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ప్రశాంత్(20) సుమారు సంవత్సరం క్రితం వెల్దుర్తిలోని ఓ బైక్ షోరూంలో కొన్ని డబ్బులు కట్టి, మిగతా డబ్బులు ఫైనాన్స్‌లో తీసుకొని బైక్‌ను కొనుగోలు చేశాడు.
అనంతరం ప్రతి నెల వాయిదాలు సరిగ్గా చెల్లించకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఫైనాన్స్ నిర్వాహకులు బైక్‌ను తీసుకెళ్లారు. దీంతో అప్పటి నుండి మనస్తాపానికి గురైన ప్రశాంత్ ఇవాళ ఉదయం వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వెల్దుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ