Hyundai Motors | ప్రభుత్వ హాస్టళ్లకు హ్యుందాయ్ చేయూత .. 295 బంక్ బెడ్లు, 590 పరుపులు పంపిణీ
Hyundai Motors | ఝరాసంగం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు హ్యుందాయ్ మోటార్ సంస్థ ముందుకొచ్చింది.
ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో ( Hostel ) చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు హ్యుందాయ్ మోటార్ ( Hyundai Motors ) ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. లక్షల విలువైన సామగ్రిని స్థానిక అధికారులకు అందజేసింది. 295 బంక్ బెడ్లు, 590 పరుపులను సంస్థ ప్రతినిధులు అందజేశారు.

విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని 4 మొబైల్ టాయిలెట్లు, 50 దోమతెరలు, 15 ఫ్యాన్లను సమకూర్చారు. విద్యార్థులు వస్తువులను భద్రపరుచుకునేందుకు 130 ట్రంక్ బాక్స్లు 42 ఐరన్ రాక్లు, రెండు అల్మారాలను అందజేసింది. నేటి సాంకేతిక అవసరాలకు అనుగుణంగా 2 డెస్క్టాప్ కంప్యూటర్లు, మూడు మల్టీ ఫంక్షన్ ప్రింటర్లను అందజేశారు. వీటితో పాటు గ్రంథాలయానికి రెండు రాక్లు , తరగతి గదులకు 3 టేబుళ్లు, 8 ప్లాస్టిక్ కుర్చీలు, విద్యార్థులు కూర్చునేందుకు 6 విశాలమైన మ్యాట్లను పంపిణీ చేశారు .
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగదీశ్వర్, మిత్ర హోలిస్టిక్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

